: ఈ ఒక్క సాయం చేయండి: నితీశ్ కుమార్ కు లేఖ రాసిన తేజస్వీ యాదవ్


బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్, తన మాజీ బాస్ నుంచి ఓ సాయాన్ని కోరుతున్నారు. గత జూలైలో బీహార్ ప్రభుత్వం నుంచి ఆర్జేడీ బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిన తరువాత, బీజేపీ సాయంతో నితీశ్ కుమార్ తన పదవిని కొనసాగిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తేజస్వీ యాదవ్ కు కావాల్సిన సాయం ఏంటంటే, తాను ఇంతవరకూ ఉన్న అధికారిక భవనంలోనే ఉండాలని కోరుకుంటున్నారు. ఇందుకు నిశీశ్ సాయం చేయాలని ఆయన ఓ లేఖ రాశారు.

సర్క్యులర్ రోడ్ లోని 5వ నంబర్ బంగళా, పలాటియల్ ను తనకే కేటాయించాలని తేజస్వీ ఈ లేఖలో కోరారు. డిప్యూటీ సీఎం పదవిని కోల్పోయిన ఆయన, తన అధికార నివాసంగా, క్యాంప్ కార్యాలయంగా వాడిన పలాటియల్ భవంతిని కూడా ఖాళీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ భవంతిలోకి తేజస్వీ వచ్చిన తరువాత, దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆయన చాలా మార్చారని తెలుస్తోంది. కీలకమైన ప్రాంతంలో ఉండటం, పక్కనే సీఎం నితీశ్ కుమార్ ఇల్లు, ఎదురుగా లాలూ నివాసం ఉండటం తదితరాలు కూడా ఆ భవనంపై తేజస్వీకి మక్కువను పెంచాయి. కాగా, ఇటీవలే ఈ భవనాన్ని ఖాళీ చేసి కొత్త డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీకి దాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే తేజస్వీ ఈ లేఖను రాశారని సమాచారం.

  • Loading...

More Telugu News