: సొంతగూటికి చేరుకున్న నాటి 'ప్రజారాజ్యం' శోభారాణి!
మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని నిర్వహించిన వేళ, ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సేవలందించిన చందోలు శోభారాణి తిరిగి సొంతగూటికి (తెలుగుదేశం) చేరుకున్నారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ మంత్రి ఆనందబాబు సమక్షంలో శోభారాణి తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు టీడీపీ నుంచి ఆ పార్టీలోకి చేరిన శోభారాణి, ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక టీడీపీలో చేరిన తరువాత ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పనులు తనను ఆకర్షించాయని, అందువల్లే టీడీపీలోకి వచ్చానని వెల్లడించారు.