: మీకీ విషయం తెలుసా?.. క్రికెట్‌లో మల్లయుద్ధం ద్వారా టాస్‌ను నిర్ణయించడం గురించి ఎప్పుడైనా విన్నారా?


చాలామంది క్రికెట్ అభిమానులకు తెలియని వార్త ఇది. సాధారణంగా తొలుత మైదానంలో ఎవరు బ్యాటింగ్‌/బౌలింగ్‌కు దిగాలన్న విషయాన్ని టాస్ నిర్ణయిస్తుంది. మ్యాచ్‌కు ముందు మైదానంలో ఇరు జట్ల కెప్టెన్లు టాస్ వేస్తారు. సాధారణంగా జరిగేది ఇదే. అయితే టాస్‌కు బదులు మల్లయుద్ధం ద్వారా క్రీజులోకి ఎవరు రావాలో నిర్ణయించిన అరుదైన ఘటన గురించి మీకు తెలుసా?

సెప్టెంబరు 7,1905లో జరిగిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆషెస్ సిరీస్‌లో అప్పటి వరకు జరిగిన ఐదు టాస్‌లను ఆసీస్ కెప్టెన్ జోయ్ డార్లింగ్ ఓడిపోయాడు. దీంతో అన్ని సార్లు తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో విసిగిపోయి ఉన్న డార్లింగ్ ఆ తర్వాతి మ్యాచ్‌లో టాస్‌కు బదులు మల్లయుద్ధం ద్వారా టాస్‌ను నిర్ణయించుకుందామని సవాలు విసిరాడు. దీనికి ప్రత్యర్థి జట్టు కెప్టెన్ జాక్సన్ అంగీకరించాడు. అయితే తనకు బదులు జట్టు సభ్యుడు జార్జ్ హిర్‌స్ట్ బౌట్‌లో పాల్గొంటాడని చెప్పడంతో డార్లింగ్ వెనకడుగు వేశాడు.

  • Loading...

More Telugu News