: డేరా బాబా ఆశ్రమాన్ని చుట్టుముట్టిన 41 కంపెనీల పారామిలటరీ బలగాలు.. హైకోర్టు ఆదేశాలతో తనిఖీలు!
హర్యానాలోని సిర్సాలో డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్ ఆశ్రమాన్ని పోలీసులు, భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఆశ్రమంలో పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం కదిలింది. దీంతో డేరా హెడ్ క్వార్టర్స్ ను సోదా చేసేందుకు భద్రతా బలగాలతో పోలీసులు ముందుకు కదిలారు.
ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. డేరా హెడ్ క్వార్ట్స్ వద్ద కర్ఫ్యూ విధించారు. 41 కంపెనీల పారా మిలటరీ బలగాలు, నాలుగు ఆర్మీ దళాలు, స్వాట్ టీం, డాగ్ స్క్వాడ్ తో డేరా హెడ్ క్వార్టర్స్ ను చుట్టుముట్టారు. 800 ఎకరాల్లో విస్తరించిన డేరా ఆశ్రమంలో అడుగడుగున తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల కార్యక్రమాన్ని వీడియో తీస్తున్నారు.