: ట్రంప్‌పై ఒత్తిడి పెంచే యత్నం.. ఇర్మా తుపాను పేరును ‘ఇవాంకా’గా మార్చాలంటూ పిటిషన్
ఇర్మా తుపాను పేరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పేరుమీద ‘ఇవాంకా’గా మార్చాలని డిమాండ్ చేస్తూ ప్రపంచ వాతావరణ సంస్థకు ఆన్‌లైన్ పిటిషన్ అందింది. తద్వారా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌పైనా, వాతావరణ మార్పు (క్లైమేట్ చేంజ్) తిరస్కరణపైనా ఒత్తిడి తీసుకురావాలని ఆన్‌లైన్ పిటిషన్ పేర్కొంది. వాతావరణ మార్పు విషయంలో ట్రంప్ సర్కారు పూర్తి వ్యతిరేకంగా ఉందని అందులో ఆరోపించారు. క్లైమేట్ చేంజ్ విషయంలో తన తండ్రిని ఒప్పిస్తానని ఇవాంకా హామీ ఇచ్చారని, కాబట్టి ఈ విషయంలో మరింత ఒత్తిడి పెంచేందుకు ఇర్మాకు ఇవాంకా పేరు పెట్టాలని పిటిషన్‌లో కోరారు. ప్రపంచ ఆరోగ్యం, రక్షణ విషయంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లోని సభ్యులపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పిటిషన్‌లో పేర్కొన్నారు.