: నేను జనరల్ గా పెట్టిన కామెంట్స్ ని వక్రీకరించే వంకరబుద్ధులని బ్లాక్ చేస్తాను: రామ జోగయ్య శాస్త్రి


సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో ఎవరు ఎలాంటి పోస్ట్ చేసినా ట్వీట్‌ల‌ను విమ‌ర్శించ‌డానికే తాము పుట్టామ‌న్న‌ట్లు ఎంతో మంది విమ‌ర్శిస్తుంటారు. ఓ మంచి ప‌నిచేసి ట్వీట్ చేసినా దానిలోని చెడును వెతికి కామెంట్ పెట్టేవారు అధికంగానే ఉంటారు. ఇలాంటి వారిపై సినీ గేయ ర‌చ‌యిత రామ జోగ‌య్య శాస్త్రికి కోపం వ‌చ్చింది. ‘నేను జనరల్ గా పెట్టిన కామెంట్స్ ని వక్రీకరించే వంకరబుద్ధులని బ్లాక్ చేస్తాను..ఆల్రెడీ చేశాను కూడా.. నా చుట్టూ పచ్చగా ఉండాలి’ అంటూ ఆయ‌న ఈ రోజు ఓ ట్వీట్ చేశారు. రామ‌జోగ‌య్య శాస్త్రి మంచి నిర్ణ‌యం తీసుకున్నారంటూ ఆయ‌న ఫాలోవ‌ర్లు కితాబిస్తున్నారు.

  • Loading...

More Telugu News