: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మరోసారి సత్తా చాటిన టీమిండియా.. ఒక్కస్థానం దిగజారిన ఆస్ట్రేలియా
ఈ రోజు ప్రకటించిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. శ్రీలంక టూర్‌లో భాగంగా టీమిండియా 3-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో 125 పాయింట్లతో టీమిండియా టాప్ ప్లేస్‌లో నిలిచింది. మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఒకటి ఓడి ఒకటి గెలిచింది. దీంతో ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఐదో స్థానంలోకి పడిపోయింది. నాలుగో స్థానంలోకి న్యూజిలాండ్ ఎగబాకింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లకి 97 పాయింట్లే ఉన్నప్పటికీ, డెసిమెల్ పాయింట్ల ప్రకారం న్యూజిలాండ్ తరువాతి స్థానంలో ఆస్ట్రేలియా నిలిచింది. ఇక టీమిండియా తరువాతి స్థానంలో 110 పాయింట్లతో దక్షిణాఫ్రికా నిలిచింది. 105 పాయింట్లతో ఇంగ్లండ్ మూడవ స్థానంలో ఉంది.