: తిరుపతిలోని స్వామినాథన్ అగ్రికల్చర్ అకాడమీ సీజ్ కు మంత్రి సోమిరెడ్డి ఆదేశాలు!
తిరుపతిలోని ఎం.ఎస్. స్వామినాథన్ అగ్రికల్చర్ అకాడమీలో కనీస సౌకర్యాలు లేకపోవడంపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో ఆయన ఈ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా స్వామినాథన్ అగ్రికల్చర్ అకాడమీని ఆయన పరిశీలించారు. పొలాలు, ప్రయోగశాలలు లేకుండా అకాడమీ ఎలా నిర్వహిస్తున్నారంటూ ఆగ్రహించిన ఆయన, తక్షణమే ఈ అకాడమీని సీజ్ చేయాలని పోలీసులను ఆదేశించారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలకు ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు.