: ఉదయం శక్తి పుంజ్.. మధ్యాహ్నం రాజధాని ఎక్స్ ప్రెస్.. ఇప్పుడు పట్టాలు తప్పిన మరో గూడ్స్!
ఈ రోజు ఉదయం ఉత్తరప్రదేశ్‌లో శక్తి పుంజ్, ఆ తరువాత మధ్యాహ్నం ఢిల్లీలో రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. కొద్ది సేపటి క్రితం మరో రైలు పట్టాలు తప్పింది. దీంతో ఈ రోజు ఇప్పటికి మూడు రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రైలు ప్రమాదం మహారాష్ట్రలోని ఖాండాలకు సమీపంలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతం గుండా వెళుతోన్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రెండు బోగీలు పక్కకు వెళ్లాయని సంబంధిత అధికారులు చెప్పారు. ఈ మార్గంలో రైలు పట్టాలు దెబ్బతినడంతో అటుగా వచ్చే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ వరుస ఘటనలపై అధికారులు ఆరా తీస్తున్నారు.