: జెట్ యుద్ధ విమానాలతో సిరియా స్థావరాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
లెబనాన్ గగనతలం గుండా ప్రయాణించి సిరియాలోని పలు స్థావరాలపై ఇజ్రాయెల్ తమ జెట్ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఈ ఘటనపై సిరియా వివరాలు తెలిపింది. తమ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసిందని, దీంతో తమ సైనికులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. అయితే, అరబ్ మీడియా, అక్కడి హక్కుల సంస్థలు మాత్రం ఇజ్రాయెల్ చేసిన దాడి సైనిక స్థావరాలపై కాదని, సిరియాలోని రసాయన ఆయుధాలు ఉత్పత్తి చేసే స్థావరాలపైన అని తెలిపాయి. ఆ స్థావరాల భద్రతను సిరియా సేనలు చూస్తున్నాయని చెప్పాయి. ఈ దాడిపై ఇజ్రాయెల్ ఇంతవరకు స్పందించలేదు. మరోపక్క, ఇజ్రాయెల్ చేసిన దాడిపై లెబనాన్ మీడియా మండిపడింది. లెబనాన్ ఎయిర్‌స్పేస్ నిబంధనలను ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని చెప్పింది.