: అమరావతిలో కొత్తవి కడుతున్నారని.. కేసీఆర్ కూడా కొత్తవి కట్టాలనుకుంటున్నారు: వీహెచ్
అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త భవంతులు కడుతున్నారని... అందుకే హైదరాబాదులో కూడా కేసీఆర్ కొత్త బిల్డింగులు నిర్మించాలనుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఎద్దేవా చేశారు. బైసన్ పోలో గ్రౌండ్ లో సచివాలయం నిర్మించాలనే కేసీఆర్ ఆలోచన పనికిమాలినదని ఆయన అన్నారు. ఏనాడూ సచివాలయానికి రాని కేసీఆర్ కు... కొత్త సచివాలయం ఎందుకని దెప్పిపొడిచారు. ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కొత్త సచివాలయాన్ని ఎలా నిర్మిస్తారో చూస్తానంటూ సవాల్ విసిరారు. కొత్త సచివాలయంపై నగర ప్రజల అభిప్రాయాలను సేకరిస్తామని... ప్రజల ముందు బ్యాలెట్ పేపర్ పెడతామని అన్నారు.