: 2012లో ‘అర్జున్ రెడ్డి’ హీరో ఏం చేసి డబ్బులు సంపాదించుకునేవాడో చూడండి!
‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ సినిమాలతో ఘన విజయాలను అందుకున్న విజయ్ దేవరకొండకు ఇప్పుడు బోలెడు సినిమా అవకాశాలు వస్తోన్న విషయం తెలిసిందే. అయితే, సినీ రంగంలోకి ప్రవేశించకముందు విజయ్ దేవరకొండ ఏం చేసే వాడో తెలుసా? చిన్నారులకి నటనలో ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఈ విషయాన్ని ఆయనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. 2012లో తాను స్క్రిప్ట్ రాసుకుని, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తూ పిల్లలకు నటన నేర్పేవాడినని, అలా డబ్బు సంపాదించుకునే వాడినని అన్నాడు. తనకి ఎంతో ఇష్టమైన ఆ పనిని ఇప్పటికీ చేస్తున్నానని చెప్పారు. అప్పట్లో ఆ చిన్నారులతో తీసుకున్న ఫొటోలను కూడా విజయ్ దేవరకొండ పోస్ట్ చేశాడు. మీరూ చూడండి...