: డోక్లాం వివాదం గురించి బిపిన్ రావత్ వ్యాఖ్యలపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ
భారత్ ఓపికను బీజింగ్ పరీక్షిస్తోందంటూ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. బ్రిక్స్ సమావేశాల్లో జిన్ పింగ్, మోదీ భేటీలో చర్చించుకున్నదానికి విరుద్ధంగా బిపిన్ వ్యాఖ్యలు చేశారని మండి పడింది. ఢిల్లీలోని సెంటర్ ఫర్ ల్యాండ్ వార్‌ఫేర్ స్టడీస్ వారు నిర్వహించిన సెమినార్‌లో బిపిన్ మాట్లాడుతూ - `భారత్ యుద్ధానికి సిద్ధం కావాలి. యుద్ధం విషయంలో చైనా ఇప్పటికే సిద్ధమైంది` అని వ్యాఖ్యలు చేశారు.
దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జెంగ్ షువాంగ్ స్పందిస్తూ - `భారత మీడియా ప్రసారం చేసిన విషయాల మేరకు సరిహద్దు వివాదాల గురించి మాట్లాడే హక్కు ఆయనకు (బిపిన్) ఉందో లేదో మాకు తెలియదు. కానీ రెండ్రోజుల క్రితమే ఇరు దేశాల అధినేతలు అన్ని విషయాల్లోనూ కలిసి కట్టుగా ఉండాలని నిశ్చయించుకున్నారు. సరిహద్దు వివాదాల విషయం పక్కన పెట్టి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ విషయాలను సదరు మిలటరీ అధినేత దృష్టిలో ఉంచుకుంటారని భావిస్తున్నాను` అన్నారు.