: తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున చెన్నైకి వెళుతున్న మహేశ్ బాబు అభిమానులు!


తెలుగు, తమిళ భాషల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న మ‌హేశ్ బాబు ‘స్పైడ‌ర్’ మూవీ ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం కోసం ఆ సినిమా యూనిట్ అన్ని ప‌నులూ పూర్తి చేసుకుంటోంది. ఈ నెల 9న చెన్నైలో ‘స్పైడ‌ర్‌’ తమిళ వెర్షన్ ఆడియోను రిలీజ్ చేయ‌నున్నారు. ఆ త‌రువాత తెలుగు వెర్షన్‌ను హైద‌రాబాద్‌లో లాంఛ్ చేస్తారు. కాగా, చెన్నైలో జ‌ర‌గ‌నున్న ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మానికి తెలుగు రాష్ట్రాల నుంచి మహేశ్ బాబు ఫ్యాన్స్ దాదాపు 2 వేల మంది వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు స‌మాచారం. ఈ సినిమాలోని రెండు పాట‌లు ఇప్ప‌టికే విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాయి. ఈ సినిమా ఈ నెల‌ 27న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.      

  • Loading...

More Telugu News