: నాతో డ్యాన్స్ చేసేందుకు ఏ హీరో ముందుకు రాలేదు... ఒక్క చంకీ పాండే తప్ప!: సన్నీ లియోన్
బాలీవుడ్‌కి వచ్చిన కొత్తల్లో తాను చాలా వివక్షను ఎదుర్కున్నట్లు నటి సన్నీ లియోన్ చెప్పింది. తనకున్న పోర్న్ స్టార్ ఇమేజ్ కారణంగా అవార్డు ఫంక్షన్లలో తనతో డ్యాన్స్ చేసేందుకు ఒక్క బాలీవుడ్ హీరో కూడా ముందుకు రాని సమయంలో, చంకీ పాండే మాత్రం తనతో డ్యాన్స్ చేసేందుకు అంగీకరించాడని సన్నీ తెలిపింది. `నో ఫిల్టర్ విత్ నేహా` కార్యక్రమంలో ఆమె ఈ వివరాలు వెల్లడించింది. అలాగే ప్రారంభ రోజుల్లో చాలా మంది మహిళా సెలబ్రిటీలు తనని అసహ్యించుకున్నారని, అందుకే తనకు బాలీవుడ్ లో చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారని సన్నీ పేర్కొంది. కానీ తర్వాత తాను పనిచేసిన వాళ్లలో చాలా మంది తనకు మంచి స్నేహితులుగా మారారని సన్నీ వివరించింది.