: నా పేరు మార్చుకున్నాను.. ఇక అలాగే పిలవండి!: ‘అర్జున్ రెడ్డి’ హీరో ప్రకటన


మొద‌ట ‘పెళ్లి చూపులు’ ఆ త‌రువాత‌ ‘అర్జున్‌రెడ్డి’ సినిమాల‌తో గుర్తింపు తెచ్చుకున్న హీరో పూర్తి పేరు విజయ్‌సాయి దేవరకొండ. అయితే, తనను ఇక ఎప్ప‌టికీ విజయ్‌ సాయికి బదులు విజయ్‌ దేవరకొండగా పిల‌వాల‌ని ఆయ‌న చెప్పాడు. ఇలా త‌న పేరును మార్చుకుంటున్నాన‌ని, విజయ్‌ సాయి పేరు త‌న స్కూల్ డేస్‌ని గుర్తుచేస్తుందని, కానీ ఇప్పుడు తానొక‌ నటుడినని చెప్పుకొచ్చాడు. త‌న‌కు నచ్చినట్లు తాను పేరు మార్చుకోవచ్చని పేర్కొన్నాడు. అప్ప‌ట్లో పాఠ‌శాల పుస్తకం మీద దేవరకొండ అని రాస్తే త‌న టీచ‌ర్ కొట్టేద‌ని ఆయ‌న అన్నాడు.          

  • Loading...

More Telugu News