: విడుదలకు ముందే రూ. 150 కోట్లు రాబట్టిన `స్పైడర్`!
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ నటించిన `స్పైడర్` చిత్రం విడుదలకు ముందే బిజినెస్ ద్వారా రూ. 150 కోట్లకు పైగా మొత్తాన్ని తన ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణ భారతదేశంలో మహేశ్‌కి ఉన్న క్రేజ్ ఈ వసూళ్లకు కారణమని సినీవిశ్లేషకులు చెబుతున్నారు. వీటిలో రూ. 120 కోట్లు వివిధ భాషల సినిమా అనువాద హక్కుల ద్వారానే సమకూరినట్లు తెలుస్తోంది.
ఇక శాటిలైట్ ప్రసార హక్కులు, ఆడియో హక్కుల ద్వారా రూ. 30 కోట్ల వరకు `స్పైడర్` నిర్మాతలు పొందినట్టు సమాచారం. దీనికి రూ. 120 కోట్ల వరకు నిర్మాణవ్యయం అయింది. విడుదలకు ముందే రూ. 150 కోట్లు వసూలు చేసిన నాలుగో సినిమాగా `స్పైడర్` నిలిచింది. గతంలో `బాహుబలి`, `బాహుబలి 2`, `కబాలి` చిత్రాలు ఈ రికార్డును సృష్టించాయి. దసరా కానుకగా సెప్టెంబర్ 27న ఈ సినిమా విడుదలకానుంది.