: ఏంటా డ్రెస్ మిథాలీ... నువ్వేమైనా హీరోయిన్ వా?: ట్విట్టర్ పోస్టుపై నెటిజన్ల ఫైర్


భారత మహిళా జట్టు క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రస్తుతం నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన సహచర క్రికెటర్లతో ఆమె ఓ సెల్ఫీ తీసుకుని తన ట్విట్టర్ ఖాతాలో అప్ లోడ్ చేయడమే ఇందుకు కారణం. ఈ ఫోటోలో స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకున్న మిథాలీ, కాస్తంత బోల్డ్ గా కనిపిస్తోంది. ఆమె డ్రెస్సింగ్ సెన్స్ సరిగ్గా లేదంటూ పలువురు కామెంట్లు చేశారు. దాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

అటువంటి డ్రెస్సులు వేసుకోవడానికి నువ్వేమైనా సినిమా హీరోయిన్ వా? అని ప్రశ్నలు వేస్తున్నారు. అంత గ్లామరస్ గా కనిపించాల్సిన అవసరం ఏంటని అడుగుతున్నారు. కాగా, గత నెలలోనూ ఇదే తరహా బోల్డ్ ఫోటో పెట్టినప్పుడు వచ్చిన కామెంట్లపై ఆగ్రహంతో స్పందించిన మిథాలీ, తాజా కామెంట్స్ పై మాత్రం నోరు విప్పలేదు. మిథాలీ పోస్టు చేసిన ఫోటోను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News