: 20 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టి.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయిన ఇండిగో విమానం!


హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకుంది. ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం హైదరాబాదు నుంచి గుజరాత్ లోని అహ్మదాబాద్ కు 168 మంది ప్రయాణికులతో బయల్దేరింది. గాల్లో లేచిన అనంతరం విమానంలో సాంకేతిక ఇబ్బంది తలెత్తింది. దీనిని గుర్తించిన పైలట్ ఏటీసీని సంప్రదించి విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి కోరాడు. దీంతో గాల్లో లేచిన 20 నిమిషాలకే తిరిగి శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. కాగా, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు కారణాలు తెలియాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News