: వేములవాడకు ఉపఎన్నిక వస్తే అభ్యర్థిగా టీ న్యూస్ ఎండీ?
ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని రమేశ్ పౌరసత్వం చెల్లదని కేంద్రం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక ప్రశ్నార్థకంగా మారింది. దీంతో వేములవాడ స్థానానికి ఉపఎన్నిక అవసరమయ్యే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఉపఎన్నిక వస్తే ఈ స్థానంలో పోటీ చేయడానికి తెరాస పార్టీకి ఇప్పటికే అభ్యర్థి విషయంలో పూర్తి స్పష్టత ఉన్నట్లు తెలుస్తోంది.
వరుసకు కేసీఆర్ కుమారుడు, టీ న్యూస్ ఎండీ జోగినిపల్లి సంతోష్ రావును వేములవాడ స్థానంలో నిలబెట్టేందుకు తెరాస పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. మరోపక్క తన పౌరసత్వం విషయంలో చెన్నమనేని రమేశ్ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలతోనే కేంద్రం, రమేశ్ పౌరసత్వం రద్దు చేయడంతో అప్పీల్ చేసుకున్నా తనకు చుక్కెదురయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే వేములవాడ ఉపఎన్నిక జరిగితే, ఇంతకుముందు జరిగిన ఉపఎన్నికల్లాగే టీఆర్ఎస్ విజయం సాధించడం పక్కా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.