: శ్రీలంకలో దుర్మరణం పాలైన భారత్ అండర్ 17 క్రికెటర్
శ్రీలంకలో జరుగుతున్న అండర్-17 క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు వెళ్లిన 12 ఏళ్ల గుజరాత్ యువ ఆటగాడు, అక్కడి స్విమ్మింగ్ పూల్ లో మునిగి దుర్మరణం పాలయ్యాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, మొత్తం 19 మంది టీమ్ లంకకు వెళ్లి అక్కడి పమునుగమలోని ఓ హోటల్ లో బస చేశారు. లంక మీడియా రిపోర్టుల ప్రకారం, వారిలో నలుగురు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టేందుకు వెళ్లిన వేళ ఈ ఘటన జరిగింది. ఈత రాని క్రికెటర్ మునిగిపోతుంటే, స్పందించిన ఇతర ఆటగాళ్లు అతడిని బయటకు తీసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతని ప్రాణాలు పోయాయని డాక్టర్లు స్పష్టం చేశారు. అతని మృతదేహాన్ని రంగమా టీచింగ్ హాస్పిటల్ కు తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.