: ఉత్తర కొరియాతో సంబంధాలున్న దేశాలపై ఆంక్షలు.. కిమ్‌ను దారికి తెచ్చుకునేందుకు ట్రంప్ సరికొత్త అస్త్రం!


ఉత్తర కొరియా దుందుడుకు చర్యలతో కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్న ట్రంప్ తాజాగా మరో అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. తద్వారా ఉత్తర కొరియాను దారికి తెచ్చుకునేందుకు పథకం రచిస్తున్నారు. ఆ దేశంతో సంబంధాలున్న దేశాలపై ఆంక్షలు విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు అమెరికా ట్రెజరీ కార్యదర్శ స్టీవ్ ఎంనుచిన్ మాట్లాడుతూ ఉత్తర కొరియా అణు పరీక్షలపై ఐక్యరాజ్య సమితి అదనపు ఆంక్షలు విధించకుంటే తామే ఆ పని చేస్తామని, ప్యోంగ్యాంగ్‌ (ఉ.కొరియా)తో సంబంధాలున్న ప్రతి దేశంపైనా ఆంక్షలు విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సిద్ధంగా ఉందని, ట్రంప్ సంతకం చేయడమే తరువాయని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News