: ఉత్తర కొరియా ప్రయోగించిన హైడ్రోజన్ బాంబు శక్తి ఇదీ.. దెబ్బకు కొండలు ధ్వంసమయ్యాయి!


ఉత్తర కొరియా ఇటీవల ప్యుంగే-రి ప్రాంతంలో పరీక్షించిన హైడ్రోజన్ బాంబు శక్తి మామూలుగా లేదని '38 నార్త్' అనే విశ్లేషణ సంస్థ పేర్కొంది. దాని దెబ్బకు కొండలు పిండి అయిపోయాయని తెలిపింది. ఆ ప్రాంతంలో తీసిన తాజా చిత్రాలను గత చిత్రాలతో పోల్చి చూసినప్పుడు ఈ విషయం బయటపడిందని సంస్థ పేర్కొంది. బాంబు దెబ్బకు కొండచరియలు విరిగిపడ్డాయని, ఆ ప్రాంతం చిందరవందరగా మారిందని సంస్థ  వివరించింది.

ప్యుంగే-రి ప్రాంతంలో ఉత్తర కొరియా మొత్తం ఆరు అణుపరీక్షలు నిర్వహించింది. హైడ్రోజన్ బాంబు పరీక్ష అనంతరం ఆదివారం తర్వాత తీసిన ఈ ప్రాంతంలోని చిత్రాలు బాంబు శక్తిని తెలియజేస్తున్నాయని తెలిపింది. పేలుడు ధాటికి మాన్‌టాప్ పర్వతం దాదాపు ధ్వంసమైందని పేర్కొంది. ఉత్తర కొరియా గత పరీక్షల్లో ఇంతటి విధ్వంసం జరగలేదని '38 నార్త్' వివరించింది.

  • Loading...

More Telugu News