: నేనెవరితోనైనా ప్రేమలో పడితే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తా!: నేహా ధూపియా


బాలీవుడ్ నటి నేహా ధూపియా తన సమాధానంతో మీడియాకు షాకిచ్చింది. ప్రస్తుతం ప్రేమలో పడ్డారా? అంటూ అడిగిన ప్రశ్నకు దీటైన సమాధానం చెప్పింది. ప్రస్తుతం తానెవరితోనూ ప్రేమలో పడలేదని, ఒకవేళ ప్రేమలో పడితే కనుక తప్పకుండా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తానని మీడియా షాకయ్యే సమాధానం చెప్పింది.

తన పెళ్లి గురించి బంధువులు, స్నేహితులతో పాటు అభిమానులు కూడా ప్రశ్నిస్తుంటారని, అయితే ఇప్పుడే అంత రిస్క్ తీసుకోనని తెలిపింది. ప్రధానంగా తనకు రొమాన్స్ చేసేంత టైమ్ లేదని చెప్పింది. జిమ్ లో ఉన్నప్పుడు లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు మాత్రమే ఖాళీగా ఉంటానని చెప్పింది. అందుకే తన పార్ట్ నర్ ని జిమ్ లో లేదా విమానంలో వెతుక్కుంటానేమోననిపిస్తుందని నేహా ధూపియా చమత్కరించింది. 

  • Loading...

More Telugu News