: పాకిస్థాన్‌తో రాజీ అవకాశమే లేదు.. యుద్ధం చేయాల్సిందే: ఆర్మీ చీఫ్
చైనా, పాకిస్థాన్లతో యుద్ధానికి దిగడమే మంచిదని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ‘సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్’ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు చైనా దురాక్రమణకు పాల్పడుతోందని, మరోవైపు పాకిస్థాన్‌తో రాజీ కుదిరే అవకాశాలు లేవని, కాబట్టి యుద్ధం చేయడమే మంచిదని పేర్కొన్నారు. యుద్ధం ద్వారా డోక్లాం వంటి సమస్యకు చరమగీతం పాడవచ్చన్నారు. ఆ రెండు దేశాలతో ఒకేసారి యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. ఇందుకోసం ఆర్మీ సిద్ధంగా ఉండాలని బిపిన్ రావత్ పిలుపునిచ్చారు.