: ప్రధాని మోదీకి సెక్రటరీనని చెప్పుకుని హల్ చల్ చేసిన వ్యక్తి.. అరెస్ట్!
తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రిన్సిపల్ సెక్రటరీనంటూ ఓ వ్యక్తి హల్‌చల్ చేసిన ఘటన హర్యానాలోని గుర్‌గావ్‌లో చోటుచేసుకుంది. గుర్‌గావ్ డివిజినల్ పోలీస్ కమిషనర్ ఆఫీసుకు వచ్చిన ఆయన.. నేరుగా కమిషనర్ డి.సురేష్ వద్దకు వెళ్లిపోయి స్టైలుగా పరిచయం చేసుకున్నాడు.
అయితే, అతడి మాటతీరుపై అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే ప్రధానమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి అసలు విషయం తెలుసుకున్నారు. ఆ వ్యక్తి ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కాదని నిర్ధారించుకుని, అరెస్టు చేశారు. ఆ వ్యక్తి భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడైన అతుల్ కల్సి అని పోలీసులు చెప్పారు. అతడు గుర్‌గావ్‌లో ఓటర్ గుర్తింపు కార్డు కూడా సంపాదించుకున్నాడని అన్నారు. అతడిని న్యాయస్థానంలో హాజరుపర్చగా కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది.