: నాటి శపథాన్ని పక్కన పెట్టనున్న త్రిదండి చినజీయర్ స్వామి!
తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం నిర్మించే వరకు తాను శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకోనంటూ త్రిదండి చినజీయర్ స్వామి నాడు శపథం చేసిన విషయం విదితమే. గతంలో ఆయన పలుమార్లు తిరుమలను సందర్శించినప్పటికీ స్వామి వారి దర్శనం మాత్రం చేసుకోలేదు. అయితే, ఈ శపథాన్ని ఆయన పక్కన పెట్టనున్నారు. ఈ రోజు జరిగిన తిరుమల శ్రీవారి గరుడ సేవలో పాల్గొన్న ఆయన, శ్రీవేంకటేశ్వరుడిని రేపు దర్శించుకోనున్నారు.