: డేరా బాబా ఆశ్రమంలో తాజ్ మహల్ నుంచి డిస్నీలాండ్ వరకు అన్నీ దర్శనమిస్తాయి!


అత్యాచార కేసుల్లో దోషిగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చాసౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తన ఆశ్రమంలో ఓ కొత్త సామ్రాజ్యాన్నే సృష్టించాడు. హర్యానాలోని సిర్సాలో సుమారు 700 ఎకరాల్లో ఉన్న ఆశ్రమాన్ని ఇటీవల కొన్ని మీడియా సంస్థలు సందర్శించి, ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాయి. ప్రపంచంలోని చారిత్రక కట్టడాలు తాజ్ మహల్, ఈఫిల్ టవర్, డిస్నీలాండ్ వంటి అనేక నమూనాలు ఈ ఆశ్రమంలో ఏర్పాటు చేశారట.

అంతేకాదు, మొఘల్ సామ్రాజ్యానికి అద్దంపట్టే కట్టడాలు, కోటలు, రిసార్ట్స్ మొదలైనవి అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేశారు. రాక్ స్టార్ బాబాగా పేరు గాంచిన గుర్మీత్ ఆశ్రమంలోనే ఓ ఫిల్మ్ సిటీకూడా ఉందట. ఆయన సినిమాల షూటింగ్స్ ఇక్కడే జరుగుతుండేవి. అయితే, ఈ ఫిల్మ్ సిటీలోకి ఎవరిని పడితే వారిని అనుమతించే వారు కాదని, దాని చుట్టూ ఓ ఎలక్ట్రిక్ కంచె కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News