: ఈ కళ్లజోడు ధరిస్తే టైప్-2 డయాబెటీస్ దరిచేరదట!
ప్రత్యేకంగా రూపొందించిన ఈ కళ్లజోడు ధరిస్తే టైప్ -2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్శిటీ పరిశోధకులు రూపొందించిన ఈ ప్రత్యేక కళ్లజోడు పేరు రీ టైమర్. వాస్తవానికి నిద్రలేమి సంబంధిత సమస్యలతో సతమతమయ్యేవారి కోసం దీనిని తయారుచేశారు. అయితే, ఈ కళ్లజోడు ధరిస్తే డయాబెటీస్ బారిన పడకుండా ఉంటామనే విషయం తమ పరిశోధనలో వెల్లడైనట్టు పరిశోధకులు చెబుతున్నారు.
‘ఈ కళ్లజోడు ఫ్రేమ్ లో నాలుగు చిన్నలైట్లు ఉంటాయి. ఆ లైట్లు కళ్లపై పడటం ద్వారా నిద్ర లేమి నుంచి బయటపడొచ్చు. రక్తంలోని ఘగర్ లెవెల్స్ ను నియంత్రించే హార్మోన్ల విడుదలను ఇవి నియంత్రిస్తాయి. ఈ తరహా హార్మోన్ల విడుదలను నియంత్రించే సామర్థ్యం డయాబెటీస్ రోగుల్లో సక్రమంగా ఉండదు. అయితే, ఈ కళ్లజోడు లోని కాంతి ఆ హార్మోన్ల ఉత్పత్తిని సక్రమంగా ఉండేలా చేస్తుంది. ఈ కారణంగా దీనిని వినియోగించే వారికి టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఆస్కారం చాలా తక్కువుగా ఉంటుంది’ అని పరిశోధకులు చెప్పారు.