: విశాఖ‌ప‌ట్నం పోర్టులో ప‌క్క‌కు ఒరిగిన భారీ నౌక‌.. భారీగా ఆస్తి న‌ష్టం


విశాఖ‌ప‌ట్నం పోర్టులో ఓ భారీ నౌక ప‌క్క‌కు ఒరిగిపోవ‌డంతో భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. ఆ నౌక‌లోకి ఇనుప ఖ‌నిజం లోడ్ చేస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కుడివైపున బ‌రువు అధికంగా ప‌డ‌డంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఒరిగిన నౌకను స‌రి చేసేందుకు సిబ్బంది ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ భారీ నౌక విశాఖ‌ప‌ట్నం నుంచి హాంకాంగ్ వెళ్లాల్సి ఉంది. ఎంత‌ న‌ష్టం జ‌రిగింద‌న్న విష‌యంపై పూర్తి వివ‌రాలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News