: హైద‌రాబాద్‌లో ఇసుక‌ లారీ బీభ‌త్సం... ఓ మ‌హిళ మృతి


హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని విజ్ఞానపురి కాలనీ టర్నింగ్ వ‌ద్ద అదుపుత‌ప్పిన ఓ లారీ బీభ‌త్సం సృష్టించింది. అదే స‌మ‌యంలో ఆ మార్గం నుంచి తిరుమ‌ల న‌గ‌ర్‌కు వెళుతోన్న కృష్ణ అనే తాపీ మేస్త్రీ, కృష్ణ‌వేణి (35) అనే మ‌హిళ‌తో క‌లిసి బైక్‌పై ప‌నికి వెళ్తున్నాడు. ఆ బైక్‌ను లారీ ఢీ కొట్ట‌డంతో కృష్ణవేణి అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న‌లో కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై స్థానికుల నుంచి స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని కృష్ణ‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న అనంత‌రం లారీ డ్రైవర్ పారిపోవ‌డంతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News