: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి మండిపాటు


తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రజల స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నారని బీజేపీ జాతీయ నాయకురాలు, కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి మండిప‌డ్డారు. తెలంగాణ బీజేపీ శాఖ నిర్వ‌హిస్తోన్న‌ ‘విమోచన యాత్ర’లో భాగంగా ఈ రోజు మేడ్చల్‌లో బహిరంగ సభ నిర్వ‌హించారు. ఇందులో పాల్గొన్న‌ కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి మాట్లాడుతూ... 1947లో భార‌త్‌కి స్వాతంత్ర్యం వచ్చినప్ప‌టికీ, తెలంగాణకు మాత్రం 1948, సెప్టెంబర్‌ 17న వ‌చ్చింద‌ని చెప్పారు. తెలంగాణ‌ ప్రజలు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించారని అన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌పటేల్ తెలంగాణ ప్ర‌జ‌ల త్యాగాల‌ను గుర్తించి తెలంగాణకు స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టారని తెలిపారు. తెలంగాణ‌లో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకపోవడం బాధాక‌ర‌మ‌ని ఆమె అన్నారు.   

  • Loading...

More Telugu News