: పాకిస్థాన్ కు భారత్ హెచ్చరిక.. హైకమిషనర్‌కు సమన్లు
గతనెల 26న జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో పాకిస్థాన్‌కు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ సమన్లు జారీ చేసింది. ఆ రోజు ఆ ప్రాంతంలో జరిగిన దాడికి జైషే మహమ్మద్ ఉగ్రవాదులే బాధ్యులన్న విషయం తెలిసిందే. ఆ దాడిలో 8 మంది భారత భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులే ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌లో పనిచేస్తున్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
గతనెల 16, 17 తేదీల్లో రాత్రివేళ జమ్ములోకి ప్రవేశించి దాడులకు ప్రయత్నించిన కొందరు జైషే ఉగ్రవాదులను భారతసైన్యం హతమార్చిందని చెప్పింది. పాకిస్థాన్‌లో ఎలాంటి ఉగ్రసంస్థలకు గానీ, ఉగ్రవాదులకుగానీ చోటివ్వరాదని భారత్ హెచ్చరించింది. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని భారత్ గట్టిగా చెప్పింది.