: నాకు 135 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారు : తమిళనాడు సీఎం పళనిస్వామి
తనకు పూర్తి స్థాయి మెజారిటీ ఉందని తమిళనాడు సీఎం పళనిస్వామి పేర్కొన్నారు. తనకు 135 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారని, నిన్న జరిగిన సమావేశానికి 111 మంది హాజరయ్యారని చెప్పారు. అయితే, మిగిలిన ఎమ్మెల్యేలు పలు కారణాల వల్ల సమావేశానికి హాజరుకాలేకపోయారని, అంతమాత్రాన వారంతా తనకు వ్యతిరేకమని ప్రచారం జరుగుతోందని, ఇది సబబు కాదని అన్నారు. ఇదిలా ఉండగా, నేషనల్ ఎలిజబులిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ (నీట్) విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఈ విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్నామని అన్నారు.