: ‘అర్జున్ రెడ్డి’ తప్పక చూడాల్సిన సినిమా: హీరోయిన్ అనుష్క
‘అర్జున్ రెడ్డి’ తప్పకుండా చూడాల్సిన సినిమా అని ప్రముఖ హీరోయిన్ అనుష్క అభిప్రాయపడింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేసింది. ‘‘అర్జున్ రెడ్డి’ని తప్పక చూడండి.. ‘అర్జున్ రెడ్డి’ చిత్ర బృందంలోని ప్రతిఒక్కరికీ నిజాయతీగా..మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ప్రొడ్యూసర్..దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ, షాలిని పాండే.. రాహుల్ రామకృష్ణ, ఈ చిత్రంలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ కి అభినందనలు’ అని అనుష్క తన పోస్ట్ లో ప్రశంసించింది. ‘అర్జున్ రెడ్డి’ పోస్టర్ నూ ఆమె పోస్ట్ చేసింది. కాగా, అనుష్క పోస్ట్ ఫై నెటిజన్లు స్పందించారు. ‘థ్యాంక్యూ ఫర్ ప్రొమోటింగ్’, ‘ఈ సినిమా మీరెప్పుడు చూశారు అనుష్క?’, ‘సూపర్బ్ మూవీ’ అంటూ కామెంట్లు చేశారు.