: కంగనా ఇంటర్వ్యూ మాటలను పట్టించుకోనంటున్న మాజీ బాయ్‌ఫ్రెండ్
బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను తన మాజీ బాయ్‌ఫ్రెండ్ అధ్యాయన్ సుమన్ పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. కంగనా అన్న మాటల గురించి మీడియా అధ్యాయన్‌ని ప్రశ్నించగా - `క్షమించండి... నాకు ఈ ఇంటర్వ్యూ విషయం గురించి తెలియదు. అంతకంటే ముఖ్యమైన పనులు నాకు చాలా ఉన్నాయి. ఆమె అన్న మాటల గురించి కూడా నాకు తెలుసుకోవాలని లేదు` అన్నాడు.
మనుషులన్నాక ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, ప్రస్తుతం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం తనకు లేదని అధ్యాయన్ పేర్కొన్నాడు. గతంలో కంగనా తనను కొట్టిందని, వేధించిందని అధ్యాయన్ చేసిన ఆరోపణలను ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ ఖండించింది. తాను నిజంగా కొట్టినా బావుండేదని అంది. ఇదే ఇంటర్వ్యూలో రాకేశ్ రోషన్, హృతిక్ రోషన్, ఆదిత్య పంచోలీల గురించి కూడా కంగనా వివాదాస్పద విషయాలు బయటపెట్టింది. వీటిపై హృతిక్ రోషన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఆదిత్య పంచోలీ మాత్రం కంగనా పిచ్చిదని, అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోందని చెప్పిన విషయం తెలిసిందే.