: అవసరమైన సమయంలో ధోని దగ్గరికి వెళ్లి సలహాలు తీసుకుంటా: యువ బౌలర్ శార్దూల్ ఠాకుర్
టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని దగ్గర తాను చాలా నేర్చుకున్నానని ఇటీవలే అంతర్జాతీయ వన్డేల్లో తన తొలి మ్యాచ్ ఆడిన టీమిండియా యువ బౌలర్ శార్దూల్ ఠాకుర్ అన్నాడు. ధోని వికెట్ కీపర్ కావడంతో ఎంతో మంది బౌలర్ల బౌలింగ్‌ను ఆయన గమనిస్తాడని తెలిపాడు. టీమ్ ఒత్తిడిలో ఉన్న సమయంలో ఎలా బౌలింగ్ చేయాలో ధోనికి బాగా తెలుసని అన్నాడు. అవసరమైన సమయంలో ధోని దగ్గరికి వెళ్లి సలహాలు తీసుకుంటానని చెప్పాడు. ఆయన చాలా మంచి సూచనలు చేస్తాడని అన్నాడు. శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా ఈ రోజు ఏకైక టీ20 మ్యాచ్ ఆడనుంది.