: అప్పట్లో వివ్ రిచర్డ్స్ కి డ్రైవర్ గా పని చేశా... 25 ఓవర్లు బౌలింగ్ కూడా చేశా!: బ్రయాన్ లారా

వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా తన కెరీర్ లో చోటుచేసుకున్న ఆసక్తికర సంఘటనలను లండన్ లోని చారిత్రక లార్డ్స్ మైదానంలో మంగ‌ళ‌వారం 'ఎంసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ కౌడ్రీ లెక్చ‌ర్' సందర్భంగా మీడియాతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లెజెండ్ వివ్ రిచ‌ర్డ్స్‌ కు డ్రైవ‌ర్‌ గా ప‌నిచేశాన‌ని అన్నాడు. క్రికెటర్ గా 1991లో తొలిసారి త‌న ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వచ్చానని గుర్తు చేసుకున్నాడు. ఆ రోజుల్లో తనది వాటర్ బోయ్ పాత్ర అని చెప్పాడు. తుది జట్టులో స్థానం లభించలేదని అన్నాడు. దీంతో ఒక టూర్ గేమ్‌ కు వివ్ రిచర్డ్స్ తో పాటు వెళ్లానని తెలిపాడు. ఒకరోజు ఎవరైనా బౌలింగ్ చేస్తారా? అని వివ్ రిచర్డ్స్ అడిగారని, దీంతో తాను చేస్తానని ముందుకు వచ్చానని అన్నాడు.

దీంతో ఏడు ఓవర్లు ఏకధాటిగా లెగ్ బ్రేక్స్‌, గూగ్లీస్ వేసి ఇక చాల‌నంటే వివ్ రిచర్డ్స్ అంగీకరించలేదని, దీంతో తాను 25 ఓవ‌ర్లు బౌలింగ్ చేశానని గుర్తుచేసుకున్నాడు. అన్ని ఓవర్లు వేసి, ఒక్క వికెట్ కూడా తీయ‌కుండా 130 పరుగులిచ్చానని తెలిపాడు. అలాగే, ఆ రోజుల్లో రిచ‌ర్డ్స్‌ కు గిఫ్ట్‌ గా వ‌చ్చిన కారు కీని తనకు ఇచ్చాడని గుర్తు చేసుకున్నాడు. ఆ టూర్ మొత్తం ఆ కారుకి డ్రైవర్ ను తానేనని అన్నాడు. తాను డ్రైవర్ సీట్లో కూర్చుని డ్రైవ్ చేస్తే రిచ‌ర్డ్స్ ప్యాసెంజ‌ర్ సీట్లో కూర్చునే వాడని తెలిపాడు. ఆ టూర్ మొత్తం తాను రిచర్డ్స్ డ్రైవర్ గానే వ్యవహరించానని తెలిపాడు. కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదని అన్నాడు.

అప్పటి నుంచి అనితర సాధ్యమైన రికార్డులు సాధిస్తూ.. స్టాన్స్ మార్చడంలో తనను మించిన వారు లేరనే కీర్తిని లారా తెచ్చుకున్నాడు. సచిన్ సమఉజ్జీగా పేరుగాంచాడు. 

  • Loading...

More Telugu News