: అనంతపురంలో హృదయ విదారక ఘటన... పసికందును దారుణంగా చంపేసిన వైనం!
అనంతపురం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఆ నగరంలోని జేఎన్‌టీయూ రోడ్డులో ఉన్న శ్మశాన వాటిక బయట ఓ పసికందు మృతదేహం కనిపించింది. ఆ పాప మెడ చుట్టూ తాడుతో గొంతును బిగించి చంపేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆ పాప రెండు చేతులనూ నరికేసి, ఇలా శ్మశానం బయట విసిరేసి వెళ్లారు. ఆడపిల్ల అయినందుకే ఆ పసికందును చంపేసి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ పాప మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అనంతపురం నగరంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం మొదటిసారి కాదని, గతంలోనూ ఇటువంటి దారుణాలు చోటు చేసుకున్నాయని అక్కడి ప్రజలు అన్నారు.