: జైలు నుంచే డేరా కార్యకలాపాలు చూడనున్న గుర్మీత్... స్పష్టం చేసిన చైర్‌పర్సన్ విపాసన
అత్యాచారం కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష పడిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ రోహ్‌తక్‌లోని సునారియా జైలు నుంచే సిర్సాలోని డేరా సచ్ఛా సౌధా వ్యవహారాలను చూసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డేరా సచ్ఛా సౌధా చైర్‌పర్సన్ విపాసన ఇన్సాన్ వెల్లడించారు. గుర్మీత్ దత్తపుత్రిక హనీప్రీత్‌కు, డేరాకు ఎలాంటి సంబంధం లేదని ఆమె పేర్కొంది. డేరా కార్యకలాపాలను ఎవరికీ కట్టబట్టే యోచనలేదని ఆమె స్పష్టం చేసింది.
అలాగే, గుర్మీత్ కుటుంబ సభ్యులకు డేరా వ్యవహారాలకు ఎలాంటి సంబంధం లేదని ఆమె తెలియజేసింది. వారసత్వం విషయంలో వస్తున్న వార్తలను కూడా ఆమె ఖండించింది. ఇక హనీప్రీత్ ఎక్కడ ఉందనే సంగతి కూడా తమకు తెలియదని విపాసన చెప్పింది. అయితే జైలులో తనను కలవాల్సిన టాప్ 10 మంది జాబితాలో హనీప్రీత్ సింగ్ పేరును గుర్మీత్ మొదట పేర్కొన్న సంగతి తెలిసిందే.