: 'నిత్యానందతో చనువు' వీడియోపై మళ్లీ కోర్టుకెక్కిన నటి రంజిత!
గతంలో కలకలం రేపిన నిత్యానంద స్వామి, ఒకప్పటి హీరోయిన్, 'మావిచిగురు' ఫేమ్ రంజితలు చనువుగా ఉన్న వీడియో దేశవ్యాప్త కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తిరిగి విచారణ జరిపించాలని సీబీసీఐడీ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేయాలంటూ రంజిత మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. రంజిత తరఫున న్యాయవాది ఇళయరాజా వాదనలు వినిపించగా, విచారించిన న్యాయమూర్తి ఎంఎస్ రమేష్, వారం రోజుల్లోగా ఇప్పటివరకూ జరిగిన విచారణ గురించి పూర్తి వివరాలతో కూడిన పిటిషన్ దాఖలు చేయాలని సీబీసీఐడీని ఆదేశించారు.
కాగా, నిత్యానంద స్వామి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు యూఎస్ మహిళ గతంలో ఫిర్యాదు చేయగా, అదే సమయంలో ఆయన రంజితతో అత్యంత చనువుగా ఉన్న వీడియోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన పోలీసులు, పలువురిని నిందితులుగా చేర్చి చార్జ్ షీట్ ను కూడా దాఖలు చేశారు. విచారణ చివరి దశకు చేరిన తరుణంలో రంజిత, తాజా పిటిషన్ ను దాఖలు చేయడం గమనార్హం.