: ముగ్గురు విజయవాడ అమ్మాయిలు ఇళ్లు వదిలిన కారణమిదే!


నిన్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్కూలుకని బయలుదేరి వెళ్లిన విజయవాడ, నున్న ప్రాంతానికి చెందిన ముగ్గురు అమ్మాయిలూ క్షేమంగా విజయవాడ చేరారు. వీరిని హైదరాబాద్ లో గుర్తించిన పోలీసులు క్షేమంగా ఇళ్లకు చేర్చారు. చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లో వైభవంగా జరిగే వినాయక నిమజ్జన వేడుకల గురించి వింటూ వచ్చిన వారు, ఈ సంవత్సరం ప్రత్యక్షంగా నిమజ్జనాన్ని చూడాలని ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వచ్చేశారని పోలీసులు వెల్లడించారు.

ఖైరతాబాద్ గణేశ్ ను చూడాలన్న ఆశతో వీరు వచ్చారని తెలిపారు. వీరు వచ్చేటప్పటికే, ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ముగిసిందని, కాసేపు ఉండి తిరిగి బయలుదేరాలని వీరు భావించారని, అంతలోనే వారి ఆచూకీని కనిపెట్టామని తెలిపారు. మరోమారు ఇలాంటి పనులు చేయవద్దని బాలికలకు కౌన్సెలింగ్ ఇచ్చినట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News