: బాలయ్య నన్ను రెండు సార్లు కొట్టారు!: రానా


యువ నటుడు రానా హోస్ట్ చేస్తున్న 'నెం.1 యారీ విత్ రానా' షోలో ప్రముఖ నటుడు బాలకృష్ణ సందడి సందడి చేశారు. పూరీ జగన్నాథ్, రానాలతో కలసి నవ్వులు పూయించారు. రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో... షోలో కూడా అలాగే ప్రవర్తించారు. అంతేకాదు, పైసావసూల్ సాంగ్ కు డ్యాన్స్ కూడా చేశారు. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఘటనలను రానా గుర్తు చేసుకున్నాడు. బాలయ్య సింప్లిసిటీ గురించి చెబుతూ... బాలయ్య తనను రెండు సార్లు కొట్టారని చెప్పాడు. బాలయ్యను తాను ఒకసారి 'సార్' అని పిలిచానని... దీంతో, 'ఎవడ్రా నీకు సార్' అంటూ ఒక్క దెబ్బ వేశారని... మరోసారి, 'అంకుల్' అని పిలిస్తే కొట్టారని తెలిపాడు.

  • Loading...

More Telugu News