: మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా... 101 మంది మహిళలకు చీరలు పంచిన బాలయ్య!


తన కుమారుడు మోక్షజ్ఞ పుట్టిన రోజు వేడుకలను ఈ ఉదయం హిందూపురంలో వైభవంగా జరిపించిన నందమూరి బాలకృష్ణ, తన 101వ చిత్రం 'పైసా వసూల్' విజయవంతమైన సందర్భాన్ని పురస్కరించుకుని 101 మంది మహిళలకు చీరలను పంచారు. హిందూపురంలోని తన అభిమాన సంఘం నాయకులు ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరైన బాలకృష్ణ, ఉత్సాహంగా కనిపించారు.

 ఈ కార్యక్రమానికి బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీసు అధికారులు, బాలయ్యతో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడ్డారు. ఆడపడుచులకు చీరలు పంచడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని, తన కుమారుడు దీర్ఘాయువుతో వర్థిల్లాలని, నానమ్మ, తాతయ్యలు ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. వారి ఆశీస్సులు, నందమూరి అభిమానులు మోక్షజ్ఞ వెంట ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News