: సంప్రదాయ వస్త్రాలతో రెజ్లింగ్ రింగ్‌లోకి వెళ్లిన కవితా దేవి.... వీడియో చూడండి!
'డబ్ల్యూ డబ్ల్యూ ఈ' మల్లయుద్ధ పోరాటాలకి సంప్రదాయ సల్వార్ కమీజ్ ధరించి వెళ్లి భారత మహిళ మల్లయోధురాలు కవితా దేవి అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మే యంగ్ క్లాసిక్ టోర్నమెంట్‌లో ఆమె న్యూజిలాండ్‌కు చెందిన డకోటా కైతో తలపడింది. ఈ పోటీలో ఆమె గెలవకపోయినా రెజ్లింగ్ రింగ్‌లోకి సంప్రదాయ వస్త్రాలతో వెళ్లినందుకు ఆమెను భారత నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
అలాగే పోటీలో భాగంగా ఆమె చేసిన విన్యాసాలను కూడా వారు మెచ్చుకుంటారు. కవితా దేవి పోటీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హర్యానాకు చెందిన కవితా దేవి 'డబ్ల్యూ డబ్ల్యూ ఈ' రెజ్లింగ్ పోటీలకు ఎంపికైన మొదటి మహిళ. భారత యువతుల్లో రెజ్లింగ్ మీద ఆసక్తి కలిగించడానికే తాను సల్వార్ కమీజ్ ధరించి రింగ్‌లోకి దిగినట్లు కవితా దేవి చెప్పారు.