: దారి తెలియక ఆగిన పలు విమానాలు... హైదరాబాద్ లో ల్యాండ్ కావాల్సినవి బెంగళూరు, విజయవాడకు మళ్లింపు!


హైదరాబాద్ ను కమ్మేసిన దట్టమైన మేఘాల ప్రభావం శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై పడింది. కేవలం కొన్ని వందల మీటర్ల ఎత్తులోనే మేఘాలు ఆవరించడంతో విమానాశ్రయంలో దిగాల్సిన విమానాలకు ఏటీసీ అధికారులు అనుమతి నిరాకరిస్తున్నారు. దీంతో పలు విమానాలను బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు మళ్లిస్తున్న పరిస్థితి ఎదురైంది. ఈదురు గాలులు వీస్తుండటంతో గడచిన రెండు గంటలుగా ఏ విమానం టేకాఫ్ కాలేదని తెలుస్తోంది. దీంతో వందలాది మంది ప్రయాణికులు ఎయిర్ పోర్టులో పడిగాపులు పడుతుండగా, ముంబై, ఢిల్లీకి బయలుదేరాల్సిన విమానాలు ప్రయాణికులను ఎక్కించుకుని టేకాఫ్ కు అనుమతి కోసం వేచి చూస్తున్నాయి.

  • Loading...

More Telugu News