: ఐపీఎల్ మీడియా హక్కుల వేలానికి వ్యతిరేకంగా పిటిషన్ వేయనున్న ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి
ఈ-వేలం ద్వారా కాకుండా సాధారణ పద్ధతిలో ఐపీఎల్ ప్రసార హక్కులను వేలం వేయడంపై బీసీసీఐ మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ప్రకటించారు. త్వరలో ఐపీఎల్ ప్రసార హక్కులను స్టార్ ఇండియాకు ధారాదత్తం చేయడాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తానని ఆయన ట్విట్టర్‌లో వెల్లడించాడు. వచ్చే ఐదేళ్లకు రూ. 16,347.50 కోట్లకు ఐపీఎల్ ప్రసార హక్కులను స్టార్ ఇండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
జూలైలో ఐపీఎల్ ప్రసార హక్కులను ఈ-వేలం ద్వారా కేటాయించాలంటూ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ-వేలం ద్వారా హక్కులను కేటాయిస్తే బీసీసీఐకి తీవ్ర నష్టం జరుగుతుందని, అందుకే సాధారణ వేలం ద్వారానే హక్కులను కేటాయించాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.