: పాకిస్థానీ క్రికెటర్‌ని పెళ్లి చేసుకోనున్న తమన్నా... నెట్‌లో చక్కర్లు కొడుతున్న పుకారు!
మిల్కీబ్యూటీ తమన్నా పాకిస్థానీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌ను వివాహం చేసుకోబోతుందని ఇంటర్నెట్‌లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. వీటన్నింటికి కారణం వాళ్లిద్దరూ కలిసి ఓ నగల దుకాణంలో షాపింగ్ చేస్తున్నపుడు దిగిన ఫొటో అని తెలుస్తోంది. అయితే ఈ ఫొటో షాపింగ్ చేస్తూ దిగింది కాదని 2013లో దుబాయ్‌లో నగల దుకాణం ప్రారంభవేడుకకు వీరిద్దరూ హాజరైనపుడు తీసిన ఫొటో అని మరో వాదన వినిపిస్తోంది. వీటిలో ఏది నిజమో తమన్నానే స్వయంగా చెబితే గానీ స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు. గతంలో కూడా తమన్నా ఓ బిజినెస్‌మేన్ పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.