: శరద్ యాదవ్ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయండి: వెంకయ్యనాయుడికి జేడీయూ నేతల వినతి
జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు ఆ పార్టీ నేతలు వినతిపత్రం అందజేశారు. రాజ్యసభలో జేడీయూ ఫ్లోర్ లీడర్ గా ఉన్న శరద్ యాదవ్ ను ఆ స్థానం నుంచి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తొలగించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఆర్సీపీ సింగ్ పేరును నితీష్ ప్రతిపాదించారు. మరోవైపు, బీజేపీతో నితీష్ కుమార్ జతకట్టడాన్ని నిరసిస్తూ... కొత్త పార్టీ పెట్టే యోచనలో శరద్ యాదవ్ ఉన్నారు.