: 'ఎర్త్ షేకింగ్ న్యూస్' చెప్పిన ఉత్తర కొరియా 'పింక్ లేడీ'!


రీ చున్ హీ... ఉత్తర కొరియాలో ప్రముఖ న్యూస్ యాంకర్. అందరూ ఆమెను అమ్మమ్మగా కూడా పిలుచుకుంటారు. సంప్రదాయ గులాబీ రంగు వస్త్రాలు ధరించి ఆమె చెప్పే వార్తలను ఆసక్తిగా వింటుంటారు. 74 ఏళ్ల వయసులో 'వాయిస్ ఆఫ్ నార్త్ కొరియా'గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, వార్తలు చదువుతూ ప్రపంచం వణికిపోయే కబురును కళ్లముందుంచారు. ఖండాంతర క్షిపణి పరీక్షలను మరింత ముందుకు తీసుకెళుతూ, హైడ్రోజన్ బాంబును ఉత్తర కొరియా విజయవంతంగా పరీక్షించినట్టు, ప్రపంచానికి ఆమె నోటి నుంచి వచ్చిన వార్తే తొలి సమాచారం.

 జాతీయ అణ్వాయుధాల కార్యక్రమం చివరి దశకు వచ్చిందని, కొరియన్ సెంట్రల్ టెలివిజన్ లో ఆమె చదివిన వార్తలు ప్రపంచాన్ని వణికించాయి. గడచిన 40 ఏళ్లుగా కొరియా సమాచారాన్ని ప్రపంచానికి అందిస్తూ వచ్చిన రీ, 1994లో కిమ్ 2 సుంగ్ మరణించిన వేళ, కన్నీరు పెడుతూ, బ్రేకింగ్ న్యూస్ ను చెప్పారు. 2012లో ఆమె పదవీ విరమణ తీసుకున్నప్పటికీ, అడపా దడపా ముఖ్యమైన వార్తలను ప్రజలకు అందించాల్సి వచ్చినప్పుడు కొరియా అధికార టెలివిజన్, అమెనే పిలుస్తుంటుంది. అత్యున్నత స్థాయి వార్తలను యువ యాంకర్లతో చెప్పించడం తమ దేశాధినేతకు ఇష్టం లేదని ఉత్తర కొరియా అధికారి ఒకరు తెలిపారు. ఇక రీ నోటి నుంచి వచ్చిన హైడ్రోజన్ బాంబు ప్రయోగం వార్త స్టాక్ మార్కెట్లను కుదిపేయగా, ట్రంప్ సైతం తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News